నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలో గడపగడపకు కార్యక్రమం నిర్వహించిన బిజెపి.రాష్ట్రకార్యవర్గసభ్యురాలుకొండ మణెమ్మ
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి జులై28( జనం సాక్షి ) నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు సంజయ్ నగర్ కాలనీలో మహాజన్ సంపర్కు అభియాన్ లో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండ మణెమ్మ నాగేష్ ఆధ్వర్యంలో గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించడంజరిగింది.సంజయ్ నగర్ కాలనీ లో అర్హులైన ప్రజలకు డబల్ బెడ్ రూమ్స్ కాని, ఇంటింటికో ఉద్యోగం కానీ, కొత్త రేషన్ కార్డు కానీ రాలేదని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఈ కాలనీ లో ప్రధాన సమస్య అని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండ మణెమ్మ నాగేష్కివివరించారు, అనంతరం కొండ మణెమ్మ నాగేష్ స్పందిస్తూ ఈ కాలనీ సమస్యలను కలక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఫుల్ టైమర్ ఖానపురం శరత్, ప్రధాన కార్యదర్శి సైదులు, నాగర్ కర్నూల్ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్, తాడూర్ మండల ప్రధాన కార్యదర్శి మేరే ఆంజనేయులు, వెల్డింగ్ పర్వతాలు మండల నాయకులు స్వామి, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు బాల మణెమ్మ, సంతోష్, గగ్గలపల్లి శివ బూత్ అధ్యక్షులు చెన్న రాయుడు, బీజేవైఎం అంజి తదితరులు పాల్గొన్నారు.