నాగేంద్రనగర్ లో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ.
ఎరుగట్ల ఆగస్టు 22 (జనం సాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని నాగేంద్ర నగర్ గ్రామంలో సర్పంచ్ మంజుల బాలాజీ గౌడ్ సోమవారం గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహాయ సహకారాలతో గ్రామంలో సిసి రోడ్లు, బస్ షెల్టర్, పల్లె ప్రగతి వనం, క్రిమిటోరియం, డంపింగ్ యార్డ్, వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అందుకు మా గ్రామ ప్రజలు ఎంతో రుణపడి ఉంటామని, ఈ సందర్బంగా మంత్రి వేములకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొల్లి శంకర్, మాజీ ఎంపిటిసి లింగారెడ్డి, ఉపసర్పంచ్ జాతర కొండ శేఖర్, వార్డు సభ్యులు గడ్డి రాజేశ్వర్, చింతల సతీష్ సందె సుమాంజలి, గ్రామ కమిటీ సభ్యులు ముక్కెరమల్లేష్ యాదవ్,కిషన్ గౌడ్, ఎర్ర మురళి,బోడరాజు,మస్తాన్ గ్రామ సభ్యులు శాంసన్, గజేందర్, ప్రదీప్, శంకర్,గంగుల రమేష్,పోశన్న, గంగయ్య, సురేష్,షాహిద్ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.