నాటునాటు పాటకు అక్కా చెల్లెళ్ల కొత్త రిథమ్‌

హైద‌రాబాద్‌ జ‌నంసాక్షి

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ బాక్సీఫీస్‌ ను బద్దలు కొట్టి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. మూవీలోని పాటలు కూడా చార్ట్‌బస్టర్‌ హిట్‌గా నిలిచాయి, ముఖ్యంగా పెప్పీ డ్యాన్స్‌ ట్రాక్‌ నాటు నాటు సాంగ్‌ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. పాటకు తగ్గట్టు రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రదర్శించిన స్మూత్‌ కొరియోగ్రఫీని ఎవరు మర్చిపోలేరు! అయితే ఇప్పుడు రికార్డు సృష్టించేందుకు రిఫ్రెషింగ్‌ డ్యాన్స్‌ తో వచ్చిన ఇద్దరు సిస్టర్స్‌ ట్రెండిరగ్‌ లో నిలిచారు.
ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ కి ఫిమేల్‌ వర్షన్‌ ట్రాక్‌ సాంగ్‌ కు ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు డ్యాన్స్‌ చేస్తూ, వాళ్లే మ్యూజిక్‌ వాయిస్తూ సాంగ్‌ ను రీ క్రియేట్‌ చేసే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ విూడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియోలో డ్యాన్స్‌ చేసే వీరి పేర్లు అంటారా, అంకిత. ఇక వీరు చేసిన డ్యాన్స్‌ కు సంబంధించిన వీడియో యూట్యూబ్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ లలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన వారంతా అద్భుతంగా ఉందంటూ కితాబిస్తున్నారు.