నాని కొత్త చిత్రం దసరా

ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త కథలను చూపించాలకునే అతికొద్ది మంది నటులలో నాని ఒకడు. సినిమా సినిమాకు వేరియషన్‌ చూపిస్తూ ఇండస్ట్రీటో దూసుకుపోతున్నాడు. ఈయన నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ’అంటే
సుందరానికీ’ సినిమాతో మరో విజయం ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ప్లిక్స్‌లో
స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇక నాని ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ’దసరా’. శ్రీకాంత్‌ ఓదెలా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రంలో నాని డీ గ్లామర్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన నాని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం గురించి నాని తాజాగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడిరచాడు. ఈ చిత్రం నాని కెరీర్‌లోనే మోస్ట్‌ ఛాలెంజింగ్‌ అని, గ్రావిూణ నేపథ్యంలో తెరకెక్కే అవుట్‌ అండ్‌ అవుట్‌ రా సినిమా అని తెలిపాడు. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంతోష్‌ నారాయణ్‌ స్వరాలను సమకూరుస్తున్నాడు.