Thursday, 5 November 2026

*నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ పట్టణంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఎలక్షన్లను గౌరవ అధ్యక్షుడు కేతపల్లి యాదగిరి నేతృత్వంలో మంగళవారం నిర్వహించారు.పట్టణ అధ్యక్షునిగా రాయించు నరసింహ,ప్రధాన కార్యదర్శిగా మేడిపల్లి సైదులు,కోశాధికారిగా రాచమల్ల వెంకన్న గెలుపొందారు. అనంతరం వారు మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ సోదరులకు, పెద్దలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.నా వంతు సంఘానికి సహాయ,సహకారాలు ఉంటాయని సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని సంఘంలో ఏ విధమైన సమస్యలు వచ్చినా నేను ముందుండి నడిచి సమస్యలను పరిష్కరిస్తాను అన్నారు.