నిందితుడిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి
వికారాబాద్ జిల్లా మానవహక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు జనగాం వెంకట్ రెడ్డి
దోమ అక్టోబరు 13(జనం సాక్షి)
దోమ మండలం అయినాపూర్ గ్రామంలో గత మూడు రోజుల క్రితం ఓ యువతిని ఆర్మీ ఉద్యోగి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన కేసులో నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని వికారాబాద్ జిల్లా మానవహక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు జనగాం వెంకట్ రెడ్డి పోలీసులను డిమాండ్ చేశారు. గురువారం ఆయన బాధితురాలిని పరామర్శించి వివరాలు మొత్తం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా ఇంతవరకు నిందితుడిని పోలీసులు రిమాండ్ చెయ్యకపోవడం ఏమిటని,బాధిత యువతికి వెంటనే న్యాయం చేయాలని ఆయన అన్నారు.