కో రెడ్డి నర్సింగ్ కౌట బిఆర్ఎస్ లో చేరే
జనం సాక్షి అక్టోబర్ 13
కో రెడ్డి నర్సింగ్ కౌటా గ్రామానికి ఓ మంచి కార్యకర్తగా పేరు సంపాదించుకున్న నేతగా ఎదిగిన నేత కో రెడ్డి నర్సింగ్ ఈయన ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఎప్పుడు అండగా నిలుస్తూ ఉంటాడు. తాను ఇన్ని సంవత్సరాలుగా బిజెపిలో ఉన్నప్పటికీ తాను తన గ్రామానికి అభివృద్ధి పథంలో తేలేకపోయానని ఇకనైనా బిఆర్ఎస్ పార్టీ కండువా తీసుకుంటే తన గ్రామం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో బిఆర్ఎస్ లో చేరుతున్నట్లు కో రెడ్డి నర్సింగ్ తెలిపారు బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న తన పార్టీ కండువను కో రెడ్డి నర్సింగ్ ని కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బిజెపి నాయకులు కోటి రూపాయల నిధులలొ కొంతవరకే తన గ్రామానికి ఉపయోగించారని మిగతావి పక్కదారి పట్టించారు అని తమ అవినీతి బండారమును ఇంకా కొన్ని రోజులలోనూ బయట పెడతామని చర్చలకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న జైనథ్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి జైనథ్ మండల ఎంపీపీ మల్సెట్టి గోవర్ధన్ వైస్ ఎంపీపీ విజయ్ సెట్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు పాల్గొన్నారు.