నిగ్వా గ్రామంలో కిరనన్నా ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక
భైంసా రూరల్ ఆగస్టు 07జనం సాక్షి
నిర్మల్ జిల్లా ముధోల్ తాలూకా కుబీర్ మండలం నిగ్వా గ్రామంలో సోమవారం కిరణ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ గ్రామస్తులతో ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకుల, వయోజనులు పెద్దలు కార్యక్రమానికి హాజరై తమ సలహాలు అందించారు.ఈ సందర్భంగా డా.కిరణ్ మాట్లాడుతూ….డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే వైద్య, విద్యా రంగాలలో సేవలందించామనీ, రానున్న రోజుల్లో విస్తృత స్థాయి సేవలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ప్రత్యక్ష రాజకీయంలో అడుగుపెట్టడానికి సిద్ధమైతున్నట్లు తెలిపారు. పుట్టి,చదువుకున్న గ్రామ0నుండే ఆత్మీయ కలయిక కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ… గ్రామం నుండి ఆత్మీయ కలయక కార్యక్రమం ప్రారంభించడం ఆనందమైన విషయమని, కరోనా లాంటి విపత్కర పరిస్తితులలో మి వైద్య సేవలు ఇప్పటికి మేము మర్చిపోలేము అని తెలిపారు. అందరు సంఘటితమై రానున్న రోజుల్లో డాక్టర్ కిరణ్ నీ అసెంబ్లీలో పంపించడానికి సహాయ శక్తులకు కృషి చేస్తామని అన్నారు.