నిజామాబాద్ గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగం.. ముఖ్యాంశాలు:

• ఆనాటి నాయకత్వం చిన్న పొరపాటు చేసి, తెలంగాణను ఆంధ్రాలో కలిపితే.. మళ్లీ తెలంగాణ తెచ్చుకోవడానికి ఇన్నేండ్లు పట్టింది.• ఆనాటి నాయకత్వం చిన్న పొరపాటు చేసి, తెలంగాణను ఆంధ్రాలో కలిపితే.. మళ్లీ తెలంగాణ తెచ్చుకోవడానికి ఇన్నేండ్లు పట్టింది.• నేను కూడా సావు నోట్లో తలపెడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది.• ఒకనాడు నిజామాబాద్ లో భారీ ప్రాజెక్టు ఉండేది.• వలస పాలనలో నిజాంసాగర్, సింగూరు నీల్లు మనకు రాలేదు.• తెలంగాణలో పేదలు, మహిళలు, విద్యార్థులకు ఎన్నో పథకాలున్నయి• దేశంలో 24 గంటలు నాణ్యమైన కరెంటును అన్నిరంగాలకు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమే.• తరతరాలుగా అణచివేయబడ్డ దళితులను ఆదుకోవడానికే దళితబంధు తెచ్చినం.• మా తండాలో మా పాలన కావాలని గిరిజనులంటే ఎవరూ చేయలేదు• 3600 తండాలను గ్రామ పంచాయితీలుగా చేసుకున్నం.• గురుకుల పాఠశాలలు పెట్టుకున్నం. విద్యనందిస్తున్నం.• జీడీపీ పెరిగింది. తలసరి ఆదాయం పెరిగింది.• సీఎంఆర్ఎఫ్ తో పేద ప్రజలను ఆదుకుంటున్నం.• తెలంగాణ అభివృద్ధి మీద చర్చ చేసుకోవాల్సి ఉన్నది.• మీ వ్యవసాయ బావుల కాడ మీటర్లు పెట్టాల్నా?• నరేంద్రమోడీ మీటర్లు పెట్టాలంటడు.• విమానాలు, ఓడరేవులు, బ్యాంకులు, పరిశ్రమలు ఇట్లా అన్నీ అమ్మిండ్లు• ఇగ ఇపుడు ఎవుసం మీద పడ్డరు కేంద్రంలోని బీజేపీ వాళ్లు• పంటలు కొనక, పంటలకు ధరలు రాక ఎవుసం బందు కావాలె• మన భూములను అమ్ముకునే పరిస్థితి వస్తే.. వాటిని మోడీ దోస్తులే కొంటరట.• ఒకనాడు నిజామాబాద్ ఖలీల్ వాడీ మైదానంలో చెప్పిన.. నా ప్రాణం పోయినా సరే తెలంగాణ తెస్త.. తెచ్చిన తెలంగాణను బాగు చేస్త అన్న.• మనం అందరికీ ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ.. ఉచితాలట. వాటిని బంద్ చేయమని కేంద్రం వాల్లు చెప్తరు. • ఈ నిజామాబాద్ గడ్డ లక్ష్మీ గడ్డ నుంచి మోడీని ప్రశ్నిస్తున్న..• దేశంలోని రైతులందరికీ సాగునీరు కరెంటు ఇస్తే 1 లక్షా 45 వేల కోట్లు మాత్రమే ఖర్చవుతయి. • ఎన్.పి.ఏల కింద 12 లక్షల కోట్ల సంపద అమ్ముకున్నరు. మీరు దేశ రైతులందరికీ ఉచిత కరెంటు ఇవ్వలేరా?• వచ్చే ఎన్నికల్లో దేశంలో నాన్ బీజేపీ ప్రభుత్వం వస్తుంది.• 2024లో బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో బీజేపీని సాగనంపుదాం, మన ప్రభుత్వమే తెచ్చుకుందాం.• బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. దేశ రైతులందరికీ ఉచిత కరంటు ఇస్తం• వాళ్లు మన బాయిల కాడ మీటర్లు పెట్టుడు కాదు• రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న వీళ్లకే మనం మీటరు పెట్టాలె• రైతు సంఘాలు, రైతు బిడ్డలు మీ గ్రామాల్లో సమావేశాలు పెట్టాలె. • రైతు వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలె. ఆ చైతన్యం రావాలె• దేశంలో నిరుద్యోగం పెరిగింది. రూపాయి పతనమైంది.• దళితులు, బలహీన వర్గాలు ఎవరికీ ఏమీ చేయలేదు• దేశంలో ప్రతిపక్ష గవర్నమెంటులను కూలగొట్టుడేనా మీ పని• ఒక్కనిగా బయలుదేరిన.. అందరినీ కూడగట్టి, రాష్ట్రం సాధించిన.• భారత దేశమే ఆశ్చర్య పోయింది. గ్రామాల్లో కుల వృత్తులన్నింటినీ  కాపాడుకుంటున్నం. • దేశం కోసం నన్ను పోరాడాలంటున్నరు. అందరూ వెంట ఉంటరట.• మీరందరూ నన్ను ఆశీర్వదిస్తరా.. చెప్పాలె.. (జనంలో చప్పట్లు) • సరే, మనం జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కూడా ప్రారంభిస్తం• ముందుకు పోతం, తెలంగాణలాగే దేశాన్ని బాగు చేస్తం.• దేశంలో అన్నిరంగాల్లో కేంద్రం విఫలమైంది.• ఇయ్యాల మీ జిల్లా కాల్వల్లో నీళ్లు పారాల్నా• మత పిచ్చి మంటల్లో కాలిపోవాల్నా• పచ్చని పంటలు కావాల్నా.. మతపిచ్చి మంటలు కావాల్నా..• ఒక ఇల్లు కట్టాల్నంటే చాలా కష్టం.. కూలగొట్టాలంటే సులభం• దేశం బాగుంటెనే.. రాష్ట్రం బాగుంటది.• మతపిచ్చి, విద్వేషాన్ని రగిలిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలె• దేశంలో నాన్ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలె.• నిజామాబాద్ పాత కలెక్టరేట్ భవనం ఉన్నచోట ఇందూరు కళాభారతి ఆడిటోరియం కట్టుకుందాం.• నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా.• ఉమ్మడి జిల్లాలోని 8 నియోజకవర్గాల అభివృద్ధికి గతంలో ఇచ్చిన ఎమ్మెల్యే ఫండ్స్ కు అదనంగా 10 కోట్ల రూపాయల నిధులిస్తున్నా. • దళితబంధు పథకం ఇవ్వడం మన సామాజిక బాధ్యత, • ప్రజా ప్రతినిధులు దళితబంధును ముందుకు తీసుకుపోవాలె.• నన్ను జాతీయ రాజకీయాలకు పోవాలని మీరంతా ఆదేశమిచ్చినందుకు ధన్యవాదాలు.
• జై తెలంగాణ..   జై జై తెలంగాణ