పాట్నా,జూన్4(జనం సాక్షి ): రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున నితీశ్ కుమార్ పార్టీ నిలుస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగీ తెలిపారు. నితీశ్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీ ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఎన్డీఏకు మద్దతు ఇవ్వనున్నట్లు త్యాగీ వెల్లడించారు. త్యాగీతో పాటు మరికొంత మంది పార్టీ సీనియర్ నేతలు ఆదివారం నితీశ్నివాసంలో సమావేశం అయ్యారు. ఆ తర్వాత వాళ్లు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. లోక్ జన శక్తి పార్టీ, రాష్టీయ్ర లోక్ సమతా పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో నితీశ్‌కు మద్దతుగా పనిచేస్తాయన్నారు. త్వరలోనే సీట్ల పంపకంపై బీజేపీతో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు జేడీయూ నేత తెలిపారు.




