హైదరాబాద్, జనంసాక్షి: విద్యుత్ చార్జీల పెంపునై నిమ్స్‌లో కొనసాగిస్తున్న దీక్షను భాజపా నేతలు విరమించారు. పార్టీ జాతీయ నేత రవిశంకర్‌ప్రసాద్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్, యెండల లక్ష్మీనారాయణలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. పాత ఎమ్మేల్యే క్వార్టర్స్ వద్ద గత నాలుగు రోజులుగా దీక్ష చేపట్టిన నేతలను నిన్న సాయంత్రం అరెస్టు చేసి పోలీసులు నిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిదే.




