నియంతృత్వ పాలన తగదు: బిజెపి

నిజామాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలన సాగుతోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి విమర్శించారు. నకిలీ విత్తనాలు, వర్షాలతో రైతులు నట్టేట మునిగినా రైతులను పట్టించుకోరా అని అన్నారు. రైతు సమస్యలపై ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే బిజెపి ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు, మూడెకరాల భూ పంపిణీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రూ.300 కోట్లతో సచివాలయ భవన నిర్మాణం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు.