– మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల
హైదరాబాద్, జులై19(జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) గురువారం మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీలో 124 బిల్‌కలెక్టర్ పోస్టులు, బేవరేజెస్ కార్పొరేషన్‌లో 78 ఖాళీలను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీచేయనున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్‌లోని ఖాళీల్లో 56 అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్-2, 13 అసిస్టెంట్ ఆఫీసర్ గ్రేడ్ -2, 9 డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తులు స్వీకరించనున్న టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4తో కలిపి పరీక్ష నిర్వహించనున్నది. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను టీఎస్‌పీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.




