నిరుద్యోగులు వ్యాపారాల్లో రాణించాలి – పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు
జనంసాక్షి , కమాన్ పూర్ :
నిరుద్యోగులు వర్తక వ్యాపారాల్లో రాణించాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో శ్రీ చక్ర సిల్క్ అండ్ ఫ్యాషన్ షాపును కమాన్ పూర్ సర్పంచ్ నీలం సరితతో కలిసి పుట్ట మధు అన్నారు. యువకులు ఉద్యోగాల కొరకు వేచి చూడకుండా తమ కాళ్ళపై తాము నిలిచి ఉండేందుకు ఏదైనా వ్యాపారం చేసుకోవాలని పుట్ట మధు పెట్టిన వ్యాపారం బాగా నడిచి పైకి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నీలం సరిత శ్రీనివాస్, కమాన్ పూర్ సింగిల్ విండో ఛైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, ఎంపిటిసిలు కోలేటి చంద్రశేఖర్, బోనాల వెంకటస్వామి, ఉప సర్పంచ్ బొజ్జ సాగర్ తదితరులు పాల్గొన్నారు.