Thursday, 5 November 2026

నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు.

 

కార్పొరేట్ కంపెనీలకు ఏజెంట్ గా మారిన మోడీ ప్రభుత్వం

నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన రాష్ట్ర ప్రభుత్వం

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలనీ తెలంగాణ జన సమితి విజ్ఞప్తి

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్లు విడుదల చేస్తాం అంటూ పత్రికా ప్రకటనలకుతో కాలయాపన చేస్తూ నిరుద్యోగులు ఆత్మహత్యలకు కారణం అవుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలనీ తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళితారకరామారావు కోరారు.మోడీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి గద్దె ఎక్కిన తర్వాత నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపించడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ కార్పొరేట్ కంపెనీల చీకటి సామ్రాజ్యానికి ఏజెంట్ మోదీ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన విమర్శించారు.మత విద్వేషాలు రెచ్చగొడుతూ గోవధ చట్టాన్ని అడ్డంపెట్టుకుని బీజేపీ ఆర్ ఎస్ ఎస్ గుండాలు దళితులు గిరిజనులు మైనారిటీలపై దాడులు చేస్తూ అమాయక ప్రజలను హత్యలు చేస్తున్న నరహంతక పాలన కు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.రాష్ట్ర విభజన హామీలు అయిన లక్ష మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఉపాధి చూపించే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ,కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లు,బడ్జెట్లో ప్రస్తావన తీసుకు రాలేని అసమర్థ బీజేపీ పాలనకు నిరుద్యోగ యువత తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.