నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిది: సర్పంచ్ అప్పవారు శ్రీనివాస్.
సీఎం సహాయ నిధి ద్వారా నిరుపేదలకు వరం లాంటిదని సర్పంచ్ అప్పవారు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలో గాజులపల్లి గ్రామనికి చెందిన భవాని,15500రూపాయలు, ఖాజా పాషా 12500రూపాయల మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.