నిరుపేద కుటుంబ అంత్యక్రియలకు డిఎస్పి తరఫున ఆర్థిక సహాయం అందించిన నియోజకవర్గ ఇన్చార్జి సీఎం నర్సింలు

మోమిన్ పేట సెప్టెంబర్ 21 జనం సాక్షి
నిరుపేద కుటుంబ అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేసిన బిఎస్పి నాయకులు మోమిన్ పేట మండలం
ఎన్కతల గ్రామంలో  గుడుపల్లి బాల్ రాజ్ అనే వ్యక్తి ప్రమాదవశ్యస్తు రోడ్డు ప్రమాదంలో నిన్న మరణించడం జరిగింది.ఆ విషయం తెలుసుకున్న వికారాబాద్ నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ సీఎం  నర్సిములు  అయన కుటుంబాన్ని కలిసి  ఓదార్చి, అయన అంతిమ యాత్రకు ఆర్థిక సహాయంగా 4000 రూపాయలను సహాయం చేయడం జరిగింది.ఆయన ప్రమాదవశాస్తూ మరణించడం బాధాకరం అని అలాగే ఈయొక్క పేద కుటుంబాన్ని అదుకోవాలని,అధికార పార్టీ కి సంబంధించిన నాయకులతో మాట్లాడి దళిత బంధు స్కీమ్ ను ముందుగా ఈయొక్క కుటుంబానికి అందేలా చేయాలని ప్రభుత్వవానికి డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మామిన్ పేట మండలఅధ్యక్షులు కోల్కొంద రాజు,వర్కింగ్ ప్రజెంట్ ప్రవీణ్, నియోజకవర్గ సోషల్ మీడియా కో – కన్వీనర్ గణేష్, సిరిపురం బీఎస్పి నాయకులు రవీందర్ రెడ్డి,ఎన్కతల గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు