నిరుపేద మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్

ఆత్మకూరు(ఎం) ఆగస్టు 11 (జనంసాక్షి) ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన యాస అంజి రెడ్డి s/o నర్సిరెడ్డి గారి అకాల మరణం పట్ల చింతిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఆత్మకూర్ ఎం మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ గారు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ యాస కవితఇంద్రారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ కోరే బిక్షపతి రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోరేవెంకన్న మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి యువజన విభాగం అధ్యక్షులు ప్రతి కంఠం శాంతన్ రాజు మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి అజీమ్
బీసీ సెల్ మండల అధ్యక్షులు తవిటి వెంకటేశ్వర్లు సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల విజయ్ మండల కార్మికవిభాగం సెక్రటరీ జనరల్ కదిరే నవీన్ తదితరులు పాల్గొన్నారు