నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం
నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు సభ్యులు
చొప్పదండి, జూలై 24 (జనం సాక్షి)): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ చొప్పదండి అధ్యక్షులు వేల్మ మల్లారెడ్డి రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా చొప్పదండి పట్టణానికి చెందిన నిరుపేద విద్యార్థి అయిన పొన్నం ప్రవళిక కు 5000 రూపాయల ఆర్థిక సహాయం సంఘం తరఫున అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రాథమిక సహకార సంఘం తరఫున ప్రతి సంవత్సరం 13 మంది నిరుపేద విద్యార్థులకు 5000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని అందులో భాగంగా సోమవారం కేటీఆర్ జన్మదిన పురస్కరించుకొని చొప్పదండికి చెందిన నిరుపేద విద్యార్థిని పొన్నం ప్రవళికకు 5000 ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ముద్ధం మహేష్ గౌడ్ డైరెక్టర్లు గుర్రం ఆనంద రెడ్డి, కళ్లెం లక్ష్మారెడ్డి, నాంపల్లి మల్లయ్య, బండారి కొమురయ్య, కార్యదర్శి కళ్లెం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.