Tuesday, 3 November 2026

నిర్మాణ వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలి

నగర ప్రజల నుంచి డిమాండ్లు
హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చాలా సీరియ్‌సగా ఉందని, పట్టణ ప్రణాళికా నిబంధనలు ఉల్లంఘించి ఎవరు భవనాలు నిర్మించినా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ హెచ్చరించారు. ఇప్పటికే అనేక విధాలుగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నా పెద్దగా చర్యలు లేవన్న విమర్శలు ఉన్నాయి. వివిధ ప్‌ఆరజెక్టులకు సంబంధించి వాటి వ్యవహారాలను వెబ్‌సైట్‌లో పెట్టాలన్న డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో అవి ఎంతవరకు సక్రమమో అక్రమమో తెలుస్తుందని అంటున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ‘ఇంటి నిర్మాణం – సందేహాలు- సమాధానాలు’ అంశంపై సదస్సు సందర్భంగా  ఓపెన్‌ ప్లాట్‌, అపార్ట్‌మెంట్‌ ప్లాట్‌ కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్మాణ అనుమతి దరఖాస్తు విధానాలతో కూడిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం దళారులను ఆశ్రయించవద్దని, ఎవ్వరికీ పైసా ఇవ్వాల్సిన అవసరంలేదని, దరఖాస్తు నుంచి రుసుం చెల్లింపు వరకు అంతా ఆన్‌లైన్‌ సదుపాయం ఉందన్నారు.  కొనుగోలుదారులూ అప్రమత్తంగా ఉండాలన్నారు. జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం 500 ప్లాన్లు అందుబాటులో ఉంచామని, మున్ముందు వీటి సంఖ్య 4,000లకు పెంచుతామని చెప్పారు. ఫసియుద్దీన్‌ మాట్లాడుతూ… అనుమతులు ఎలా తీసుకోవాలనే దానిపై అవగాహన లేక చాలా మంది మధ్యవర్తులను ఆశ్రయిస్తుండడంతో అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు. అయితే ఎక్కడ ప్లాట్‌ కొనాలన్నా అనుమానాలు కలగడమే గాకుండా లిటిగేషన్లు కూడా పెరిగాయి. దీంతో సైట్ల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలన్న డిమాండ్‌ ఉంది.