నిర్విఘ్నంగా ముందుకు సాగాలి
- రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
– మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):ఎటువంటి విఘ్నాలు కలుగకుండా తెలంగాణ సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.కరోనాతో గడిచిన రెండు సంవత్సరాలుగా ఇంటికే పరిమితమైన వినాయక చతుర్ధిని ఘనంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.సకలశాస్త్రాలకు అధిపతిగా కొలువుదీరిన ఆడిదేవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని ప్రార్దిస్తున్నన్నారు.ఏక దంతుడి దీవెనలతో ప్రజలంతా శాంతి,సౌబ్రతత్వం వెల్లి విరిసిలా గణపతి నవరాత్రోత్సవాలు జరుపు కోవాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.