గద్వాల ఆర్ సి. ఆగస్ట్ 31 (జనం సాక్షి);
గద్వాల పట్టణంలో పట్టణ పోలీస్ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బంది గద్వాల పట్టణంలో అక్రమంగా అమ్ముతున్న నిషేధిత పాన్, గుట్కా మసాలాల ప్యాకెట్ లను
పట్టుకున్నట్లు పట్టణ ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి తెలిపారు. వీటి యొక్క మొత్తం విలువ అందాజ 15 వేల రూపాయలు ఉండవచ్చునని తెలిపారు.
నిందితుల యొక్క వివరాలు తెలియజేస్తూ ,కె మోహన్ బాబు ,హర్లయ శెట్టి ,నల్లకుంట గద్వాల.ఎ రాజేష్ గౌడ్ , శేరిల్లి వీధి ,హనుమంతు కుమ్మరివీధి, తెలుగు దౌలు,తెలుగు మద్దిలేటి పాత బస్ స్టాండ్ , గద్వాల్ వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి గారు తెలిపారు.
నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం




