నీరుపేదలకు అండగా జనంపల్లి అనిరుద్ రెడ్డి..

– కాంగ్రెస్ సీనియర్ నాయకులు.
ఊరుకొండ, సెప్టెంబర్ 22 (జనంసాక్షి):
నిరుపేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త జనంపల్లి అనిరుద్ రెడ్డి నిలుస్తున్నారని
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆన్నారు. ఊరుకొండ మండల పరిధిలోని మాదారం గ్రామంలో అంకురి బాలయ్య(65) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త జనంపల్లి అనిరుద్ రేడ్డి అన్న వెంటనే స్పందించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దహన సంస్కారానికి రూ.5000/- కాంగ్రెస్ నాయకుల ద్వారా ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. కార్యక్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ యాదయ్య, బల్ రేడ్డి, శంకర్, నాగేష్, నరేష్, నాగమల్లి,బంధీగయ్య , మధు , శ్రీను, యునుస్, యాకుబ్ అంకురి చెన్నయ్య, అంకురి బంధీగయ్య తదితరులు పాల్గొన్నారు.