రుద్రంగి సెప్టెంబర్ 13 (జనం సాక్షి) ఉపాధ్యాయులు,అంగన్వాడి టీచర్లకు,ఆరోగ్య కార్యకర్తలకు మరియు ఆశా కార్యకర్తలకు శిక్షణ మంగళవారం వైద్యాధికారి మసూద్ ఆధ్వర్యంలో నులిపురుగుల నిర్మూలన పై శిక్షణ ఇవ్వడం జరింది. ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికి ఈనెల 15న అల్బెండజోల్ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. కావున తల్లిదండ్రులు మీ పిల్లలకు తప్పకుండా అల్బెండజల్ మాత్ర వేయించండి.చందుర్తి మరియు రుద్రంగి మండలములలో ఒకటి నుంచి 19 సంవత్సరాలు నిండిన పిల్లలు 12,400 మంది పిల్లలు కలరునీ వారందరికీ ఈ మాత్రలు పంపిణీ చేస్తున్నట్టు వైద్యాధికారి తెలిపారు.
నులిపురుగుల నిర్మూలన కార్యక్రమము పై అవగాహన సదస్సు




