నులిపురుగుల మందు పంపిణీ
నంగునూరు, సెప్టెంబర్15(జనంసాక్షి):
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచనల మేరకు నంగునూరు మండలం జెపి తండా గ్రామంలో గురువారం రోజున అర్హులైన పిల్లలందరికీ నులిపురుగుల మందు పంపిణీ చేసినట్లు గ్రామ సర్పంచ్ బిక్షపతి నాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ… ఈ నులిపురుగులు అనేవి పిల్లల శరీరంలో ఉన్నట్లయితే పిల్లలకు అందించే అన్ని రకాల పోషక పదార్థాలను తీసుకుంటూ పిల్లల శారీరక ఎదుగుదలను పూర్తిగా అడ్డుకుంటాయన్నారు. కావున పిల్లలకు నులిపురుగుల నిర్మూలన మందులు వేయించడంలో తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థులు, గ్రామ సర్పంచ్, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
Attachments area