నూతన ఆసరా పెన్షన్లు అందించిన ఎమ్మెల్యే హరిప్రియ

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్29(జనంసాక్షి)

అర్హులైన 1213 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పెన్షన్లను ఇల్లందు ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియ సోమవారం గార్ల మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పధకాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ప్రజా శ్రేయస్సుకోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గార్ల జడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ లక్ష్మీ, ఎంపీపీ మూడ్ శివాజీ చౌహన్, తెరాస మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు శీలంశెట్టి రమేష్, గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్, సర్పంచుల సంఘం అధ్యక్షులు ధరావత్ సకృ, వైస్ ఎంపీపీ కట్టబోయిన శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు ఎండి ఖదీర్ బాబా, ఎంపీటీసీ ఆలోత్ పరెంగిన్, మండల పార్టీ ప్రధానకార్యదర్శి పానుగంటి రాధాకృష్ణ, ఎంపీడీఓ రవీందర్, తహసీల్దార్ రాము, ఎస్సి వెంకన్న, వివిధ గ్రామాల కార్యదర్శులు, ఎంపీటీసీ లు, సర్పంచులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.