• తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే.. ఈ రోజు మనం పెద్దపల్లి జిల్లాను ఏర్పాటు చేసుకోవడమేకాదు, అద్భుతమైన కలెక్టరేట్ కట్టుకున్నం.
• పేదలు, రైతుల కోసం మనం కలలో కూడా ఊహించనటువంటి మంచి పథకాలు అమలు చేసుకుంటున్నం
• ఉద్యమ సమయంలో నేను అనేకసార్లు పెద్దపల్లికి వచ్చిన..
• ఈరోజు సింగరేణిలో వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు వస్తున్నయి
• కార్మికులకు దేశంలోనే అత్యధికంగా బోనస్ ఇచ్చుకుంటున్నం.
• కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నం
• ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నది.
• నిన్నటివరకూ 26 రాష్ట్రాల రైతులతో కూర్చున్నం
• ఇక్కడ ఉన్న రైతు పథకాలేవీ మాకు లేవు అన్నరు వాళ్లు
• మీరు జాతీయ రాజకీయాల్లోకి రావాలని నన్ను కోరిండ్రు
• పోదామా.. జాతీయ రాజకీయాలకు? (హర్షంతో ప్రజల చప్పట్లు)
• గుజరాత్ మోడల్ అని అధికారంలోకి వచ్చి, ప్రజల్నిగోస పెడుతున్నరు
• బీజేపీ అవినీతి గద్దలు కోట్లాది రూపాయల మోసాలు చేస్తున్నరు
• గాంధీ పుట్టిన రాష్ట్రం గుజరాత్ లో మద్యపాన నిషేదం చేసినమన్నరు
• కానీ, అక్కడ కల్తీ మద్యంతో 70 మందికిపైగా చనిపోయిండ్రు
• దీనికి మీరు ఏం సమాధానం చెప్తరు మోడీ గారూ?
• గుజరాత్ లో 24 గంటల కరంటు రాదు, పేదలకు ఆరోగ్య పథకాలు లేవు
• గుజరాత్ లో పేద వర్గాలకు 2 వేల రూపాయల పెన్షన్ ఇవ్వరు
• కానీ, ఆ దొంగల బూట్లు మోసే దొంగలే తెలంగాణలో కనపడుతాండ్లు
• మనం ఆత్మగౌరవంతో ఉందామా.. ఢిల్లీకి గులాములవుదామా?
• దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాలపై ఆలోచన చేయాలె
• తెలంగాణ రైతుల ధాన్యం కేంద్రం కొనదు.. ఇదేమంటే చెప్పదు
• తెలివితక్కువ కేంద్ర ప్రభుత్వం వల్ల బియ్యం, గోధుమలు కూడా మనం దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది.
• రూపాయి విలువ పూర్తిగా పతనమైంది. దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది.
• మోసపోతే మనం గోస పడుతం.. దయచేసి అందరూ ఆలోచించాలె
• కూలగొట్టడం అల్కటి పని, కానీ, కట్టడం అనేది ఎంతో కష్టమైన పని
• మతం పేరుతో కొట్లాడుండ్రి అని ఈ దొంగలు చెబుతున్నరు, విందామా?
• మన కాల్వల్లో నీళ్లు పారాల్నా, మతం మంటల్లో నెత్తురు పారాల్నా?
• ఈ దొంగల బారిన పడితే ఎలా? చాలా ప్రమాదం ఉన్నది ఇపుడు.
• నేను చెప్పే మాటల్లో వాస్తవం ఉన్నది.. అందుకే వాన చినుకులు పడుతున్నయి.
• రైతులకు మేలు చేస్తే, ఫ్రీ కరంటు ఇస్తే మీటరు పెట్టాలంటరు
• ఈరోజు ఈ పెద్దపల్లి నుంచే నేను అనౌన్స్ చేస్తున్న
• రేపు రాబోయే ఎన్నికల్లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పారద్రోలి, రైతుల ప్రభుత్వం రాబోతా ఉన్నది.
• ఈ గోల్ మాల్ ప్రధాని మోడీ చెప్పేదంతా అబద్దం
• దేశంలోని రైతులు వ్యవసాయానికి వాడేది కేవలం 20.8 శాతం మాత్రమే
• రైతులు వాడే కరంటు ఖర్చు 1 లక్ష 45 వేల కోట్ల రూపాయలు మాత్రమే
• రైతులకు మీటరు పెట్టాలనే బీజేపీ మోడీకే.. మనందరం మీటరు పెట్టాలె.
• బీజేపీ వాళ్లు అన్నిరంగాల్లో అవినీతి చేస్తున్నరు.
• ఎన్.పి.ఏ. పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను 12 లక్షల కోట్లకు అమ్మిండ్రు
• శ్రీలంకలో ప్రధానమంత్రి తన దోస్తులకు కంట్రాక్టులిప్పిస్తే.. అక్కడి ప్రజలు ‘‘ఇండియన్ పీఎం మోడీ గోబ్యాక్’’ అని నినాదాలిచ్చిండ్రు.
• ఇదేనా విశ్వ గురువు చేసే పని.? దేశం పరువు తీసిండ్రు మీరు..
• ఇక్కడి గులాములతో బూట్లు మోపించుకోవడమేనా మీరు చేసేది?
• ‘తలాపున పారుతుంది గోదారి.. నా చేను నా చెలక ఎడారి’ అని పాటలు రాసిన గొప్ప మేధావులున్నరు ఇక్కడ, అందరూ ఆలోచించాలె.
• సింగరేణి గనులను కూడా ప్రైవేటువాళ్లకు అప్పజెప్పే కుట్ర కేంద్రం చేస్తాంది
• అందుకే 2024లో బీజేపీ ముక్త భారత్ ఏర్పాటు చేసుకోవాలి.
• అట్లయితెనే ఈ దేశాన్ని మనం కాపాడుకోగలుగుతం
• మేధావులు, బుద్ధి జీవులు, యువకులు నిద్రాణమై ఉండొద్దు
• మేల్కొని బీజేపీ మత పిచ్చిగాండ్ల నుంచి దేశాన్ని కాపాడుకోవాలె.
• రామగుండంలో మెడికల్ కాలేజీ వస్తదని అనుకున్నమా.. వచ్చింది.
• మిషన్ భగీరథతో రాష్ట్రంలోని అన్ని ఇండ్లకూ నీళ్లిస్తమనుకున్నమా?
• ఇక్కడికి వచ్చి బూట్లు మోపించుకోవడమేనా బీజేపీ వాళ్ల గొప్ప
• పెద్దపల్లి జిల్లాలోని 266 గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఒక్కో పంచాయతీకి 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్న
• రామగుండం కార్పొరేషన్ కు 1 కోటి రూపాయల నిధులిస్తున్న
• మూడు మున్సిపాలిటీలకు 1 కోటి రూపాయలు చొప్పున నిధులిస్తున్న
• ఈ నిధులతో మనకు అవసరమైన అభివృద్ధి పనులు చేసుకోవాలె
• బీజేపీ గద్దలు దేశంలో అన్ని వర్గాల ప్రజల ఉసురు తీస్తున్నయి
• అందుకే బీజేపీ మత విద్వేషం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలె
• వచ్చే ఎన్నికల్లో బీజేపీని విద్వేష పాలకులను పారద్రోలాలె
• కేంద్రంలో అందరినీ బాగుచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలె.
• మనమందరం కలిసి బీజేపీ ముక్త భారత్ ను సాధించుకోవాలె
• జై తెలంగాణ..
జై తెలంగాణ.. జై తెలంగాణ.. ధన్యవాదాలు




