నూతన ఓటర్ నమోదు ను పరిశీలించిన అధికారులు
నల్గొండ బ్యూరో, జనం సాక్షి ,అక్టోబర్ 11. రాష్ట్ర సంయుక్త ఎన్నికల అధికారి రవి కిరణ్,నల్గొండ అర్.డి. ఓ.జయ చంద్ర రెడ్డి,తహశీల్దార్ కృష్ణా రెడ్డి తో కలిసి మంగళ వారం మునుగోడ్ మండలం కిష్టా పురం గ్రామం లో పోలింగ్ స్టేషన్ 138,139 పరిధి లో ఇంటింటి కి తిరుగుతూ కొత్తగా ఓటర్ జాబితా లో నమోదుకు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకున్న ఓటర్లను బూత్ లెవెల్ అధికారులు(బి.ఎల్. ఓ) లు విచారించిన తీరును పరిశీలించి,సమర్థవంతంగా విచారణ చేయడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు