Wednesday, 4 November 2026

నూతన కమిటీ ఎన్నిక

చొప్పదండి ,ఆగస్టు 14 (జనం సాక్షి): చొప్పదండి కర్షక రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం చైర్మన్ గా మంగళపల్లి గ్రామానికి చెందిన వెల్మ ఏవన్ రెడ్డి ఎన్నికయ్యారు .కర్షక రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ చొప్పదండి కార్యాలయంలో లో జరిగిన సమావేశంలో వైస్ చైర్మన్ గా వెల్మ హనుమంత రెడ్డి ,ప్రధాన కార్యదర్శిగా అమరగొండ శ్రీనివాస్, కోశాధికారిగా సిరికొండ రాజు, సహాయ కార్యదర్శిగా నిట్టు శ్రీనివాసులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు నరసింహారెడ్డి ,ఎల్లయ్య, బత్తిని రాజేందర్, అమరకొండ శ్రీనివాస్, సిఎస్సి అధికారులు యాదవ రెడ్డి, రమేష్, సత్యపాల్, సహకార సంఘం కార్యదర్శి అశోక్ లు పాల్గొన్నారు.