నూతన కార్యవర్గం ఎన్నిక
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం తెలంగాణ- సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్నారు.ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు రాఘవరెడ్డి , రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సోమేశ్వర్ రావు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా మల్లేష్ , ప్రధాన కార్యదర్శిగా ఐతగోని శ్రీనివాస్, కోశాధికారిగా విగ్నేశ్వర చారితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ బలోపేతానికి , వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.అంతకుముందు జరిగిన సమావేశంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవ రెడ్డి మాట్లాడుతూ వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.వ్యాయామ విద్యా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రతి సంవత్సరం శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కృష్ణమూర్తి , చంద్రయ్య , వెంకటరత్నం, పిఈటిలు తదితరులు పాల్గొన్నారు.