నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని సీఎం కెసిఆర్ అసెంబ్లీలో తీర్మానించడం హర్షనీయం:

సాంబారి కొమురయ్య

 

జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 14: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సాంబారి కొమురయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కొమురయ్య మాట్లాడుతూ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిన్న మంగళవారం రోజున భారత ప్రభుత్వం దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్మిస్తున్నటువంటి భారతదేశ నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దేశంలో ఏ రాష్ట్రంలో అమలుచేనటువంటి సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కెసిఆర్ అమలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీల సంక్షేమం కొరకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. దళితుల వెనుకబాటు తనాన్ని గుర్తించి వారి అభ్యున్నతి కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.విడుతల వారిగా ప్రతి కుటుంబానికి దళిత బంధు పథకం వర్తింప చేస్తున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి-మండల అధ్యక్షులు వంతడుపుల దిలీప్ కుమార్, బెజ్జంకి అంజయ్య, మహంకాళి కొమురయ్య, బోయిని సాదయ్య, రాకం అనిల్, గడ్డం అనిల్, జిల్లెల్ల నాంపల్లి, మేకల బొందయ్య, జిల్లల సాదయ్య, బెజ్జంకి కొమురయ్య, చిట్యాల నరసయ్య, వేల్పుల కొమురయ్య, బోయిని సంపత్ తదితరులు పాల్గొన్నారు.