నూతన మండలంగా లక్ష్మీదేవిపేటని ఏర్పాటు చేయాలి: తెరాస మండల అధికార ప్రతినిధి ముడిగె రాజ్ కుమార్
వెంకటాపూర్(రామప్ప),ఆగస్ట్07( జనం సాక్షి):-
చుట్టూ ప్రక్కల గ్రామాలను కలుపుకుని నూతన మండలంగా లక్ష్మీదేవిపేటని ఏర్పాటు చేయాలని వెంకటాపూర్ మండల అధికార ప్రతినిధి ముడిగె రాజ్ కుమార్ అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన మండలాలకు శ్రీకారం చుట్టారని అందులో భాగంగా ములుగు జిల్లాలో ఉన్న మండలాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని,నూతనంగా లక్ష్మీదేవిపేట మండల ఏర్పాటు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.చిన్న మండలాలతో పరిపాలనా సౌలభ్యంగా ఉంటుందని అన్నారు,అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని, రానున్న రోజుల్లో మండల ఏర్పాటుకై మరింత ఎక్కువగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు.రిలే నిరాహారదీక్షలో మండల సాధన సమితి జేఏసి నాయకులు అంతగిరి రాజు,చిర్ర హరీష్,కట్టెకోల్ల వెంకటేష్,బొడ్డుపెల్లి స్వామి,పబ్బ లచ్చులు,కొండనన్న,పత్తి రవి,సీతారాం,నీలం రవి,ముడిగె శ్రీకాంత్,పబ్బ రమేష్, భద్రయ్య,పసరగొండశంకర్,రాజు,వంశీ ,అరుణ్,సమ్మయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.