నూతన సాయిరాం బిర్యానీ సెంటర్ ను ప్రారంభించిన

రాష్ట్ర యూత్ నాయకులు గూగులోత్ రవి నాయక్

కురవి సెప్టెంబర్-22
(జనం సాక్షి న్యూస్)

కురవి మండలం కంచర్ల గూడెం తండాకు చెందిన సీతారాం డోర్నకల్ నుండి మహబూబాద్ జిల్లా వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన నూతన సాయిరాం బిర్యాని సెంటర్లు ప్రారంభించిన టిఆర్ఎస్ రాష్ట్ర యూత్ నాయకులు గుగులోత్ రవి నాయక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా బిర్యాని సెంటర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని యజమాని సీతారాం ను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుజ్జి బద్రునాయక్,మండల యూత్ అధ్యక్షుడు బానోతు రమేష్,గ్రామ పార్టీ అధ్యక్షుడు డిఎస్ బాలు నాయక్,స్థానిక వార్డు మెంబర్లు నాయకులు యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.