నెరవేరనున్న గిరిజనుల చిరకాల కోరిక

సేవాలాల్ సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రవీందర్ నాయక్

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)

గిరిజనుల చిరకాల కోరికైన 10శాతం గిరిజన రిజర్వేషన్ పెంచుతూ 10 రోజుల్లో జీఓ జారీ అని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని సేవాలాల్ సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ధరావత్ రవిందర్ నాయక్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ నడిబొడ్డులో సేవాలాల్ బంజారా భవన్, ఆదివాసీ భవన్ లను నిర్మాణం చేసి ప్రాంభించుకోవడం శుభ పరిణామామన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిచ్చి వాటికి రైతు బంధు వర్తించేలా చేస్తానని ప్రకటించడం గొప్ప విషయమన్నారు. అంతేకాకుండా ఆర్ధికంగా వెనుక బడిన గిరిజన లంబాడీలను ఆదుకునేందుకు గిరిజన బంధు కూడా ఇస్తామని సీఎం ప్రకటించడం గిరిజనులకు వరం లాంటిదన్నారు.ఉక్కు కర్మాగారం, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు పై కేంద్రంపై ఒత్తిడి తెస్తామనడం గిరిజనులపై సీఎం కేసీఆర్ కు ఉన్న దార్శనికతకు నిదర్శనమన్నారు.