అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 18
అల్వాల్ నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ హరికృష్ణ నగర్ కాలనీలో5.5 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న మంచినీటి పైప్ లైన్ స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ తో కలిసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదివారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్వాల్ పరిధిలో ఉన్న ప్రతి కాలనీకి మంచినీటి సౌకర్యం మెరుగుపరిచే విధంగా తగు చర్యలు తీసుకుంటామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి త్రాగునీరు రావడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు సునీల్, రమేష్, ప్రభాకర్, శానిటేషన్ సిబ్బంది మహేందర్, టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం యాదవ్, మల్లికార్జున, రమేష్ యాదవ్, పరమేష్, వెంకటేష్ యాదవ్, సతీష్, కృష్ణ, సుదర్శన్, సురేష్, చారి, విష్ణు, భగీరథ, సరిత, రమేష్, వెంకటేష్ గౌడ్, సులోచన, శ్రీనివాస్, సంజీవ, తదితరులు పాల్గొన్నారు.




