Tuesday, 3 November 2026

నేటినుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

శాసనసభ సమావేశాలకు పటిష్ఠ భద్రత

నేడు కాంగ్రెస్‌ చలో అసెంబ్లీకి పిలుపు

సమస్యలపై చర్చకు సిద్దం అన్న ప్రభుత్వం

హైదరాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): నేటినుంచి ప్రారంభం కానున్న శాసనసభ,మండలి శీతాకాల సమావేశాలు వేడెక్కించనున్నాయి. సమావేవాలు ఎన్ని రోజులు నిర్వహించేది, ఏయే సమస్యలపై చర్చించేది బిఎసి సమావేశంలో నిర్ణయిస్తారు. విపక్ష కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగితే అడ్డుకోవడానికి అధికార పక్షం ఇప్పటికే వ్యూహాలు సిద్దం చేసుకుంది. ప్రధానంగా బిల్లులు, తదితర సమస్యలపైనే ప్రధానంగా చర్చకు అధికార పక్షం మొగ్గుచూపుతున్న వేళ, ఇటీవలి సమస్యలతో నిలదీయాలన్న ధోరణిలో కాంగ్రెస్‌ ఉంది. అందుకే తొలిరోజే చలో అసెంబ్లీ ర్యాలీ చేప్టటాలని నిర్ణయించారు. శాసనసభ సమావేశాల సందర్భంగా అన్ని ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, సభ్యులడిగే ప్రతీ ప్రశ్నకు సమగ్ర సమాచారంతో సమాధానాలు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రధాన అంశాలు, సభ్యులడగబోయే అవకాశమున్న ప్రశ్నలకు సంబంధించి ముందుగానే సమాచారం తయారు చేయాలన్నారు. ఇకపోతే సమస్యలపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని, రచ్చ చేస్తే ఊరుకునేది లేదని మంత్రి హరీష్‌ రావు కూడా గట్టిగానే హెచ్చరించారు. శాసనసభ సమావేశాల ప్రారంభం రోజున ప్రజా సమస్యలను చర్చించకుండా చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం ఆ పార్టీ అసహనానికి పరాకాష్ఠ అని అన్నారు. విషయ పరిజ్ఞానం లేనందువల్లనే పలాయనవాదాన్ని అవలంబిస్తోందని మండిపడ్డారు. తాము శాసనసభలో చర్చను కోరుకుంటుంటే సభను అవమానించేలా రచ్చ చేయాలని చూస్తోందన్నారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉందని గొప్పలు చెబుతూ చివరికి విలువలు లేకుండా రెచ్చగొట్టేందుకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు. జానారెడ్డి ¬ంమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ భద్రత కోసం జారీ చేసిన నిషేధాజ్ఞలనే తాము అమలు చేస్తామని, 27న ఏవైనా అవాంఛనీయ పరిణామాలు జరిగితే దానికి కాంగ్రెస్‌ పార్టీయే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇకపోతే ఈ నెల 27 నుంచి జరుగుతున్న శాసన సభ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లి భవనం చుట్టూ నాలుగు కిలోవిూటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధాజలు 27 ఉదయం 6 గంటల నుంచి వచ్చె నెల 2 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని కమిషనర్‌ పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించరాదని పేర్కొన్నారు. అందువల్ల కాంగ్రెస్‌ చలో అసెంబ్లీని పోలీసులు అడ్డుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణ నేపథ్యంలో నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు వివరించారు. శాసనసభ సమావేశాల నేపథ్యంలో 3 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనుమతి ఉన్న వారికి మాత్రమే అసెంబ్లీలోకి అ నుమిస్తామన్నారు. సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, పటిష్ఠమైన భద్రత కల్పించాలని మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, శాసనసభాపతి మధుసూదనాచారిలు ఇప్పటికే అధికారులను ఆదేశించారు.శాంతియుతంగా సమావేశాలు జరగాలని, గుర్తింపుకార్డులున్న వారినే అనుమతించాలని, సభ ఆవరణలో సీసీటీవీలు ఏర్పాటుచేసి భద్రతను సవిూక్షించాలన్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాల దృష్ట్యా సభ్యులు, విూడియా సౌకర్యార్థం ఏపీ శాసనసభకు కేటాయించిన లాబీలను కోరామని శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు విూడియా సలహా కమిటీ సమావేశంలో తెలిపారు.

ఇకపోతే రైతుల సమస్యలే ప్రధాన అజెండాగా శాసనసభ సమావేశాల్లో తెరాస ప్రభుత్వాన్ని నిలదీయాలని, రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా 27న చలో అసెంబ్లీ నిర్వహించాలని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం నిర్ణయించింది. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలతో బాటు సాగునీటి ప్రాజెక్టులు, శాంతి భద్రతలు సహా వివిధ సమస్యలను సభలో చర్చించాలని తీర్మానించారు. ఈ నెల 27 నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల అవినీతిపై శాసనసభలో సీఎల్పీ ఉపనేత జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, మండలిలో ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డితో మాట్లాడించాలని నిర్ణయించారు. ప్రాజెక్టులో జరిగిన ప్రమాదాలు, కాంగ్రెస్‌ నేతలపై అక్రమంగా కేసుల నమోదుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. కాంట్రిబ్యూటరీ పింఛను పథకం, రేషన్‌ డీలర్ల సమస్యలు, గొత్తికోయలపై దాడులు సహా వివిధ ప్రజాసమస్యలను లేవనెత్తాలని తీర్మానించారు. రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, నష్టపోయిన పత్తి రైతులకు ఎకరాకు రూ.20 వేలు, మొక్క జొన్న, వరి రైతులకు ఎకరాకు రూ.15 వేలు చొప్పున నష్టపరిహారం అందించాలని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ పాలన రాష్ట్ర రైతాంగానికి శాపంగా మారిందని, ఏ పంటకూ మద్దతు ధర ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు మార్కెట్ల జోక్యం కోసం ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోందన్నారు. ఇవన్నీ అసెంబ్లీలో ప్రస్తావిస్తామని అన్నారు.