పోటీలకు ఇండోర్ స్టేడియం సర్వం సిద్ధం
250 మంది బాల బాలికల క్రీడాకారుల రాక
21 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ రాక..?
ఈనెల 23 వరకు జరగనున్న సబ్ జూనియర్ బ్యాట్మెంటన్ ఛాంపియన్ షిప్
మిర్యాలగూడ, జనం సాక్షి
తెలంగాణ రాష్ట్ర స్థాయి 8 వ అండర్- 13 బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ చాంపియన్ షిప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు, నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఈ నెల 19 న ఉదయం 9 గంటలకు బ్యాట్మెంటన్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నట్లు నల్లగొండ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగారావు, కోశాధికారి రంగా శ్రీధర్ లు, తెలిపారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్
క్లియోస్పోర్ట్స్ అరేనా నూతన స్టేడియంలో విలేకరుల వారు మాట్లాడుతూ సబ్ జూనియర్ అండర్ – 13, బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ 2022 టోర్నమెంట్లో ఈనెల 23 వరకు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. ఈ నెల 19, 20 తేదీలలో క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు జరుగుతాయని, ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు మెయిన్ మ్యాచ్ లు, జరుగుతాయని వారు వివరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి అండర్ -13 ప్రతిభగల క్రీడాకారులు సుమారు 200 నుంచి 250 వరకు రానున్నారని వారు పేర్కొన్నారు. ఈ క్రీడలలో పాల్గొన్న క్రీడాకారుల ప్రతిభను, బట్టి అండర్ -15, అండర్ -17 లో ఆడే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా స్టేట్ అండర్ -13 జూనియర్ ఛాంపియన్ షిప్ పోటీలను నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 15 జిల్లాల నుంచి ప్రతిభా గల క్రీడాకారులు, ప్రతి జిల్లా నుంచి నలుగురు బాలురు, నలుగురు బాలికలు క్రీడాకారులు జూనియర్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొనున్నారని వారు వివరించారు. ఇదిలా ఉండగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోశాధికారి రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో క్రీడాకారులతో పాటు క్రీడాకారుల తల్లిదండ్రులు వారందరికీ వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈనెల 21న జరగనున్న బ్యాట్మెంటన్
మైయిన్ మ్యాచ్ లకు అంతర్జాతీయ బ్యాట్మెంటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ హాజరుకానున్నట్టు తెలిసింది.
ఈ సమావేశంలో బ్యాడ్మింటన్ కోచ్ రామకృష్ణ, ప్రముఖ న్యాయవాది ఏచూరి శ్రీనివాస్, క్లియోస్పోర్ట్స్ అరేనా స్టేడియం నిర్వాహకులు ఏచూరి శ్రీహర్ష, నేతి రాహుల్, తదితరులు పాల్గొన్నారు.




