జహీరాబాద్ మార్చి 6( జనంసాక్షి ) జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహిర్ మండల పరిధిలోని బడంపేట్ గ్రామంలో శ్రీ రాచణ్ణ స్వామి దేవాలయము జహీరాబాద్ పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో రాచణ్ణ స్వామి దేవాలయం ఉంది. జిల్లాలో అతి సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం భక్తుల కోర్కెలు తీర్చే శ్రీ రాచణ్ణ స్వామి ఆపర వీరభద్ర ఆవతారము భక్తులకు దర్శనమిచ్చి సంతృప్తిని శాంతిని ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం, బడంపేట పుణ్యక్షేత్రములో ఋషులు మహామును మహాతపస్సంపన్నులు తపస్సు చేసుకొనిన అతి పురాతనమైన దివ్యక్షేత్రము ఇక్కడ కోనేరు పవిత్రమైన గంగాతీర్థం. ఈ కోనేరులో భక్తులు స్నానమాచరించి ముక్తిని సంపాదించుటకు సులువైనది అని భక్తులు నమ్ముతారు. శ్రీ స్వామి వారి ఆలయం ప్రశాంత వాతావరణం కలిగి ఎత్తయిన చెట్లు, గుట్టలు, చెరువులు మరియు సశ్యశ్యామలమైన ప్రదేశంలో నెలవైయున్నది. శ్రీ రాచణ్ణ స్వామి అయ్యగవి అను దివ్వస్థలము బడంపేట అడవిలో ఉంది అని ఇది దేవస్థానమునకు అర కిలోమీటరు దూరంలో ఇప్పటికి కూడా భక్తులు చూడవచ్చని ఆలయ నిర్వాహకులు తెలిపారు.రాచణ్ణ స్వామి దేవస్థానములో ప్రతి నిత్యమువేలాది మంది భక్తులు జనసందడితో నిత్యపూజలతో కళకళలాడుతుంది. ప్రతి ఏటా సోమవారం తేది: 07-03-2022 నుండి 09-03-2022 ఫాల్గుణ శుద్ధ సప్తమి బుధవారం వరకు స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.ఇప్పటికే ఆలయ ఈవో శివరుద్రయ్య స్వామి, ఆలయ కమిటీ చైర్మన్ రాజు స్వామి ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ జాతరకు మన రాష్టం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనున్నారు.
నేటి నుండి శ్రీ రాచన్న స్వామి జాతర ఉత్సవాలు ప్రారంభం




