Tuesday, 3 November 2026

మల్గి గ్రామంలో ఘనంగా మహిళ బందు

జహీరాబాద్ మార్చి 6( జనంసాక్షి ) న్యాల్కల్ మండల మల్గి గ్రామంలో మహిళ బందు కార్యక్రమం లో మొదటి రోజు గ్రామ సర్పంచ్ జెట్గొండ మారుతి, ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి రాఖీ కట్టి మహిళా దినోత్సవం సందర్భంగా అంగన్వాడి టీచర్లకు పారిశుద్ధ్య కార్మికులకు యువ లీడర్లకు ఎస్.హెచ్.జి మహిళలకు సన్మానం చేశారు.ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ జెట్గొండ మారుతి, ఎంపీటీసీ శివానంద్ శ్రీపతి, వార్డు సభ్యులు, విఠల్, ఉప సర్పంచ్ తనయుడు గూడు సాబ్, సీఎ నరసింహారెడ్డి టిఆర్ఎస్ నాయకులు రాజు, ధనరాజ్ స్వామి, దాసు బాబు, బీరప్ప శ్రీనివాస్, అంగనివాడి టీచర్స్ సుకుమారి, వసంత, యువ లీడర్ శాంతమ్మ, ప్రభావతి పారిశుద్ధ్య కార్మికుల సంగమ్మ వైద్యనాథ్ చంద్రయ్య డేవిడ్, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.