Tuesday, 3 November 2026

నేడు ఆడవాళ్లూ విూకు జోహార్లు..ప్రీ రిలీజ్‌ వేడుక

రష్మిక మందన్నా, శర్వానంద్‌ జంటగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ’ఆడవాళ్లు విూకు జోహార్లు’. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 4న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌?లో భాగంగా ఈ నెల 27న హైదరాబాద్‌ శిల్పాకళా వేదికలో ప్రిరిలీజ్‌ వేడుకను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, హీరోయిన్లు కీర్తి సురేష్‌, సాయి పల్లవి ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ విూడియా వేదికగా చిత్రబృందం ప్రకటించింది. టైటిల్‌కు తగినట్లు మహిళల గొప్పతనాన్ని చాటేందుకే ఇద్దరు ప్రముఖ హీరోయిన్లను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆద్యంతో వినోదాత్మకంగా, కుటుంబంతో కలిసి చూడగలిగే సినిమా అని చెబుతున్నారు మేకర్స్‌. ఈ సినిమాలో సీనియర్‌ నటి ఖుష్బూ, రాధికా శరత్‌ కుమార్‌, ఊర్వశి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.