రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన కిరణ్ అబ్బవరం, తొలి సినిమాతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. రెండో చిత్రం ’ఎస్.ఆర్. కళ్యాణమండపం’తో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. క్లాసు ` మాసు, యూత్ ` ఫ్యామిలీ… ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు. మార్చి 4న ’సెబాస్టియన్ పిసి 524’తో హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ’సెబాస్టియన్ పిసి524’. కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లు. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో సిద్దారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ షో ఎంట్టంల్గªన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. మార్చి 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యూ/ఏ సర్టిఫికెట్‌తో సెబాస్టియం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.




