నేడు ఉద్యోగమేళా

హైదరాబాద్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి): హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌ ఇంఫో పోర్టల్‌ ట్రేడ్‌ హైదరాబాద్‌.కాం, ఇన్నోవ్‌ సోర్స్‌, డీడీ ఇనిటియేటివ్స్‌, ఈక్విటాస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ సంచాలకులు శ్రీలత తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో పదవ తరగతి, ఇంటర్మీడియెట్‌, ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ, ఎంబీఏ, బీబీఏ, బీటెక్‌లో ఐటీ, సీఎస్‌సీ చేసిన అభ్యర్థులతోపాటు ఫ్రెషర్స్‌, పూర్వ ఉద్యోగ అనుభవం ఉన్నవారు కూడా పాల్గొనవచ్చని తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.8,500 నుంచి రూ.22,800 వరకు వేతనంతో పాటు ఇతర అలవెన్స్‌లు చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ ఉచిత ఉద్యోగ మేళాలో పాల్గొనదలచిన వారు సెల్‌: 7337556150 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.