నేడు చేర్యాలలో సీపీఐ 12వ మహాసభలు..
చేర్యాల (జనంసాక్షి) జూలై 21 : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చేర్యాల మండల సమితి 12వ మహాసభలు నేడు మండల కేంద్రంలోని వాసవి గార్డెన్ లో ఉదయం 11 గంటలకు జరగనున్నాయని ఈ మహాసభలకు సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మంద పవన్, జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరవుతున్నట్లు తెలిపారు. మహాసభకు కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సిపిఐ చేర్యాల మండల కార్యదర్శి అందె అశోక్ తెలిపారు.
