ఇంగ్లీష్ లో మంచి జ్ఞానం సంపాదించుకోవాలి

అయిజ, జులై 21 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం

సంకాపురం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థు లు  సులభంగా ఇంగ్లీష్  నేర్చుకునేందుకు వీలుగా ఉన్నటువంటి  ప్రత్యేకమైన ఇంగ్లీష్ వర్క్ బుక్ ను అయిజ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శేషఫణి శర్మ  చేతులమీదుగా 6 ,7 తరగతుల విద్యార్థులకు అందజేయడం జరిగింది. వర్క్ బుక్ ను కాంప్లెక్స్ హెడ్మాస్టర్  చూసి చాలా బాగుందని ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థులకు అందే విధంగా చేసినందుకు ప్రదానోపాధ్యాయుడిని అభినందిస్తూ, ఇందుకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు .విద్యార్థులు వర్క్ బుక్ ను ఉపయోగించుకుని ఇంగ్లీషులో మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని, మాట్లాడే నైపుణ్యాన్ని నేర్చుకోవాలని ,బాగా నేర్చుకున్న  విద్యార్థులకు బహుమతులను అందజేస్తానని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులకు , తెలియజేయడం జరిగింది.

Attachments area