హైదరాబాద్:భారతదేశ చిత్రపటంపై 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణకు అప్పుడే ఏడాది అయింది. తెలంగాణ తొలి వెలుగుల నవోదయానికి 365 రోజులు నిండాయి. ఎన్నో పోరాటాలు, మరెన్నో ఉద్యమాలతో… ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తి చాటిచెప్పిన ప్రజలు… స్వరాష్ట్ర పాలనలో స్వేచ్ఛా గీతం పాడుకుంటున్నారు.




