నేడు నగర బాట కార్యక్రమం

 -32 నుండి 41 డివిజన్లలో నగర బాట
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 23(జనం సాక్షి)
   బల్దియా పరిధి లోని 10 డివిజన్ లలో నేడు (బుధవారం) నగర బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు  బల్దియా  అదనపు కమీషనర్ అనిస్ ఉర్ రషీద్ నేడోక ప్రకటనలో తెలిపారు.
  ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయి లో తెలుసుకోవడానికి  బుధవారం నగర బాట కార్యక్రమం 32,33,34,35,36,37,38,39,40,41 డివిజన్లలో కొనసాగుతుందని, ,ఇట్టి కార్యక్రమంలో నగర మేయర్  గుండు సుధారాణి, జిడబ్ల్యూ ఎంసీ కమీషనర్ తో పాటు ఆయా డివిజన్ ల కార్పొరేటర్లు  పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొంటారని, కావున ఆయా విభాగాల వింగ్ అధికారులతో పాటు  అట్టి డివిజన్ లలో విధులు నిర్వహిస్తున్నట్లు, అధికారులు, సిబ్బంది ఉదయం 6.30 గం. లకు 32 డివిజన్ ఖమ్మం ఫ్లై ఓవర్ బి ఆర్ నగర్ వద్ద హాజరు కావాలని, అక్కడి నుండి డివిజన్ల పర్యటన కొనసాగుతుందని తెలిపారు..