Tuesday, 3 November 2026

నేడు మంథనిలో బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి పర్యటన – వరద ముంపు ప్రాంతాలను సందర్శించనున్న బిజెపి నేతలు

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం లోని కాళేశ్వరం ప్రాజెక్టు వరద ముంపు ప్రాంతలైన మంథని , ముత్తారం మండలాలలోని గోపాల్పూర్, మల్లారం, ఆరేంద, అడవి సోమన పల్లి, తాడిచెర్ల, మల్లారం, ఆరెంద, వెంకట పూర్, ఖమ్మం పల్లి తదితర గ్రామాలలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ, బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకట స్వామి పర్యటించి, నష్టపోయిన రైతులను పరామర్శించడానికి ఆదివారం వస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.