గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచి, పర్మినెంట్ చేయాలి
– కారోబార్, బిల్ కలెక్టర్ లను పంచాయతీ సహాయ కార్యదర్శులుగా నియమించాలి
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి డిమాండ్
జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలో గత పక్షం రోజులుగా గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ చేస్తున్న రాష్ట్ర వ్యాప్త సమ్మె కు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి శనివారంమద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని, బూటకపు హామీలిచ్చి చిన్నచిన్న ఉద్యోగులపై అధిక పని భారం మోపడమే కాకుండా కనీసం వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు. కెసిఆర్ కి ఫౌమ్ హౌస్, ప్రాజెక్టులు కట్టడానికి నిధులు ఉంటాయి కాని ఇలాంటి పేద ఉద్యోగులకు జీతాలు పెంచడానికి నిధులు ఉండవా..? అని ప్రశ్నించారు. పక్క రాష్ట్ర లో వాలంటీర్లని రెగ్యులరైజేషన్ చేస్తే మన రాష్ట్రంలో మల్టీ పర్పస్ వర్కర్ ని ఎందుకు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా జిఓ నెంబర్ 51 ను సవరించాలని, ప్రమాదంలో మరణించిన వర్కర్ కి 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్స్ లను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి, వారికి పిఆర్సి విధానాన్ని అమలుపరిచి పర్మినెంట్ చేయాలని, అర్హతలు ఉన్న కారోబార్లను సహాయ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోషన్లు ఇవ్వాలని, గ్రామపంచాయతీ ఉద్యోగులకు ఈఎస్ఐ, పిఎఫ్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్, పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి అరె ఓదెలు ఎస్సి మోర్చా మండల అధ్యక్షులు బూడిద రాజు, మైనారిటీ మోర్చా మండల అధ్యక్షులు చంద్ పాషా,బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బుర్ర రాజు గౌడ్, సీనియర్ నాయకులు ఎడ్ల సదశివ్, కాసిపేట సంతోష్, కనుకట్ల సుధాకర్, రవి తదితరులు పాల్గొన్నారు.