నేడు మల్లు స్వరాజ్యం స్మారక భవన శంకుస్థాపన
సూర్యాపేట (జనంసాక్షి): నేడు అర్వపల్లిలో జరిగే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం స్మారకార్థం నిర్మించనున్న సీపీఎం జాజిరెడ్డిగూడెం మండల కార్యాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరుకానున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి తెలిపారు.శుక్రవారం స్థానిక ఎంవీఎన్ భవన్ లో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి అధ్యక్షతన జరిగిన జిల్లా సెంటర్ సమావేశంలో ఆయన పొల్గొని మాట్లాడారు.తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా సాయుధ పోరాటానికి కేంద్రంగా ఉన్న అర్వపల్లికి వస్తున్న సీతారాం ఏచూరి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు, ఎలుగురి గోవింద్, దండా వెంకటరెడ్డి , చెరుకు యాకలక్ష్మి , వేల్పుల వెంకన్న ,పులుసు సత్యం , మేకనబోయిన సైదమ్మ , శేఖర్, ఎలుగురి జ్యోతి , చినపంగి నర్సయ్య , వీరబోయిన రవి,జాజిరెడ్డి గూడెం సీపీఎం మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.