Tuesday, 3 November 2026

నేడు, రేపు తెలంగాణకు వర్ష సూచన..

హైదరాబాద్, : ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ నుంచి రానున్న ఈశాన్య రుతుపవనాల ప్రభావం తెలంగాణపై పెద్దగా ఉండదని వాతావరణశాఖ వివరించింది. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా మురుగు నీరు చేరింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గుంతకల్లు రైల్వే స్టేషన్‌లోని ట్రాక్‌పై నీరు చేరడంతో పలు రైళ్లను నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *